ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Published : Apr 26, 2021, 11:16 AM ISTUpdated : Apr 26, 2021, 11:24 AM IST
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

సారాంశం

ఇంటి పెద్ద కుమారుడు కరీముల్లాకు తన భార్య తో వివాదం ఉంది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించారంటూ కొద్ది రోజులుగా ఆ కుటుబంలో గొడవలు జరుగుతున్నాయి. 

కడప జిల్లాలో ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. సొంత కుమారుడే తల్లితో పాటు చెల్లి, తమ్ముడిని చంపేశాడు. తన వివాదం విషయంలో కుటుంబ సభ్యులు సహకరించడం లేదన్న కారణంతో ముగ్గురిని అతి కిరాతకంగా హతమార్చాడు.

ఆపై పోలీస్ స్టేషన్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని హైదర్ ఖాన్ వీధిలో ఈ ఘటన జరిగింది. ఇంటి పెద్ద కుమారుడు కరీముల్లాకు తన భార్య తో వివాదం ఉంది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించారంటూ కొద్ది రోజులుగా ఆ కుటుబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు.

అంతరం తెల్లవారుజామున కరీముల్లా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?