
కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో ఈ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే... ఢిల్లీ లాంటి నగరాల్లో ఆక్సీజన్ అందక పలువురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా.. అదే పరిస్థితి విజయనగరం జిల్లాలోనూ ఏర్పడింది.
విజయనగరం జిల్లాలోని మహారాజ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ కొరతతో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హరిజవర్‌లాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.