తన బైక్ మీద రాలేదని.. భార్య గొంతు కోసిన భర్త.. !

Published : Sep 04, 2021, 12:58 PM IST
తన బైక్ మీద రాలేదని.. భార్య గొంతు కోసిన భర్త.. !

సారాంశం

ఇద్దరూ పిల్లలతో కలిసి సుధాకర్, భవానీ, భవానీ తల్లి మాచర్లలో జరిగిన వివాహానికి  గురువారం ద్విచక్రవాహనంపై వెళ్లారు.  తిరిగి వస్తున్న క్రమంలో సుధాకర్ వాహనాన్ని అతివేగంతో నడపటంపై భార్య అభ్యంతరం వ్యక్తం చేసి దిగింది.   

గుంటూరు : భార్య గొంతును భర్త కోసిన  సంఘటన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఇరికేపల్లి జంగాల కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో తన భార్య అల్లూరి భవానీ గొంతును భర్త సుధాకర్ కత్తితో కోసం పరారయ్యాడు. ఈ  మేరకు బాధితురాలు భవానీ గొంతును భర్త సుధాకర్ పై శుక్రవారం పోలీసులకు  ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇద్దరూ పిల్లలతో కలిసి సుధాకర్, భవానీ, భవానీ తల్లి మాచర్లలో జరిగిన వివాహానికి  గురువారం ద్విచక్రవాహనంపై వెళ్లారు.  తిరిగి వస్తున్న క్రమంలో సుధాకర్ వాహనాన్ని అతివేగంతో నడపటంపై భార్య అభ్యంతరం వ్యక్తం చేసి దిగింది. 

భవానీతో పాటుగా పిల్లలు, ఆమె  తల్లి బస్సులో ఇంటికి చేరుకున్నారు. తనతో పాటు రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన సుధాకర్ ఇంటికి వచ్చిన తరువాత భార్య భవానీతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో సుధాకర్ కత్తితో భార్య భవానీ  గొంతు కోసి  పరారయ్యాడు.  

గమనించిన కుటుంబ సభ్యులు భవానీ దాచేపల్లిలోని  ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స  చేయించారు. గొంతుకు 16 కుట్లు పడ్డాయి. తన భర్త చేసిన దాడిపై బాధితురాలు భవానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి  ఎస్ఐ ఈ. బాలనాగిరెడ్డిక ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu