కన్నతండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడో కామాంధుడు. కన్నకూతురిని అపురూపంగా చూసుకోవాల్సినవాడు.. ఐదేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు : కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంగా మారాడు. బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. వావి వరసలు మరిచి అభం శుభం తెలియని ఆ చిట్టితల్లికి నరకం చూపేవాడు. తరచూ molestationకి పాల్పడుతూ.. పసిమనసులో చెరగని గాయం చేశాడు. ఆదివారం రాత్రి ఇలాగే చేస్తూ.. భార్య నిఘా పెట్టగా పట్టుబడ్డాడు. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఇది జరిగింది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2016లో ఓ యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. భర్త బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేటలో ఓ దుకాణంలో పని చేస్తున్నాడు.
కుమార్తె ఓ పాఠశాలలో చదువుతోంది. చిన్నారికి తల్లి స్నానం చేయించేటప్పుడు తనకు మర్మాంగం వద్ద నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న వద్ద పడుకోపెట్టొద్దని ఏడుస్తూ చెప్పేది. చిన్నారి మాటలతో ఆలోచనలో పడ్డ తల్లి తన భర్తపై నిఘా ఉంచింది. దీంతో ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది.
అనుకున్నది నిజమైనది..
ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నలుగురూ నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే భర్త బయటకు వెళ్లి వస్తానని చెప్పి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య నిద్రపోతున్నట్లు నటించింది. భార్య నిద్ర పోతుందా, లేదా అని భర్త సెల్ ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్రపోతోందని భావించి కుమార్తె పక్కన పడుకుని సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కూతురిపై అత్యాచారయత్నం చేస్తుండగా భార్య వెంటనే అతన్ని పట్టుకుంది. బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షలకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, గత మార్చిలో ఇలాంటి ఘటనే తెలంగాణలోని నల్గొండలో వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే తన కూతురిని కాటేశాడు. మూడు నెలలుగా కన్న కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో జరిగింది. 2021, మార్చి29న వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కూతురిని డిండిలోని ఓ పాఠశాలలో చదవిస్తున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూసేయడంతో బాలిక ఇంటికి వచ్చింది.
కాగా, బాలికను తండ్రి బలవంతంగా లోబరుచుకున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దాంతో తనకు ఏమీ తెలియనట్లు భార్యతో కలిసి కూతురిని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూతురిని నిలదీసింది. దీంతో తండ్రి చేసిన ఘాతుకం గురించి తల్లికి చెప్పింది.
అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ తల్లీకూతుళ్లను ఆ రోజు రాత్రి ఇంట్లో బంధించి చితకబాదాడు. తట్టుకోలేక బాలిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.