మద్యం మత్తులో గొడవ.. అత్తను చంపిన అల్లుడు

Published : Jun 13, 2020, 08:32 AM IST
మద్యం మత్తులో గొడవ.. అత్తను చంపిన అల్లుడు

సారాంశం

ఏసుబాబు తాపీ పని చేసుకుంటూ అత్త మామల వద్దే ఉంటున్నాడు. తాపీ పని అయ్యాక రోజూ సాయంత్రం మద్యం తాగి రోజూ ఇంటికి వచ్చేవాడు. భార్య నూకరత్నంతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. 

మద్యం అలవాటు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.  పిల్లనిచ్చి.. బిడ్డలాగా చూస్తున్న తల్లి లాంటి అత్తను చంపేలా చేసింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం బలరామపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో సోమరౌతు నూకరత్నం తన భర్త జగ్గప్పదొరతో పాటు కూతురు చిట్రోతు నాగమణి, అల్లుడు ఏసుబాబుతో కలసి నివసిస్తోంది. నూకరత్నం దంపతులకు ఒక్క కూతురే కావడంతో దగ్గర బంధువైన రౌతులపూడికి చెందిన చిట్రోతు ఏసుబాబుతో వివాహం చేశారు. 

ఏసుబాబు తాపీ పని చేసుకుంటూ అత్త మామల వద్దే ఉంటున్నాడు. తాపీ పని అయ్యాక రోజూ సాయంత్రం మద్యం తాగి రోజూ ఇంటికి వచ్చేవాడు. భార్య నూకరత్నంతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. 

చుట్టుపక్కల వారు, గ్రామంలోని పెద్దలు ఎన్నిమార్లు చెప్పినా తరచూ ఘర్షణ పడుతూ ఉండేవాడు. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కొట్టేవాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చిన ఏసుబాబు భార్య నాగమణితో గొడవ పడ్డాడు. 

ఆమెను కొడుతుండగా అత్త నూకరత్నం (62) అడ్డుపడి వారించే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన ఏసుబాబు ఇంటి సమీపంలోని గునపంతో అత్త తలపై మోదాడు. ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావమై కిందపడి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే బాధితురాలిని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి సాయంతో రౌతులపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. 

అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తీసుకెళ్లాలని సూచించారు. తిరిగి అదే ఆటోలో కాకినాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సినిమా సెంటర్‌కు వెళ్లే సరికి స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త జగ్గప్పదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu