కూతుర్ని వేధించారని.. పురుషాంగం కోసేశాడు

Published : Oct 22, 2018, 02:52 PM ISTUpdated : Oct 22, 2018, 02:55 PM IST
కూతుర్ని వేధించారని.. పురుషాంగం కోసేశాడు

సారాంశం

తన కూతుర్ని వేధించారని.. వారి పురుషాంగాన్ని కోసేసి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి.

తన కూతుర్ని వేధించారని.. వారి పురుషాంగాన్ని కోసేసి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...చిత్తూరు మండలం చెన్నసముద్రం గ్రామానికి చెందిన కేశవులు(54) కి భార్య, కుమార్తె ఉన్నారు.

కాగా.. కేశవులుకి లక్ష్మీపతి(55), శేఖర్(40) అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారిలో శేఖర్.. ఆర్టీసీ డ్రైవర్ గా కుప్పంలో పనిచేస్తున్నాడు. కాగా.. గత కొంతకాలంగా శేఖర్.. కేశవులు కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై కూతురు కేశవులు కి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ విషయంలో శేఖర్ పై పగపెంచుకున్నాడు.

ఆదివారం సాయంత్రం తన ఇద్దరు మిత్రులు లక్ష్మీపతి, శేఖర్ ని పథకం ప్రకారం చెరకుతోటకు తీసుకువెళ్లాడు. ఇద్దరికీ ఫుల్లుగా మద్యం తాగించాడు. అనంతరం కేశవులు మెడను కత్తితో నరికి చంపేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోననే సందేహంతో లక్ష్మీపతిని కూడా చంపేశాడు. అనంతరం ఇద్దరి పురుషాంగాలను కోసేశాడు. 

రాత్రి 10 గంటలు దాటినా వీరు ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతి కారు. ఫలి తం లేదు. పది గంటల తరువాత కేశవులు ఒక్కడే ఊర్లో కనిపించాడు. మిగిలిన ఇద్దరు ఎక్కడని గ్రా మస్తులు ప్రశ్నిస్తే తనకు తెలియదని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చెరుకు తోటలో శేఖర్, లక్ష్మీపతి విగతజీవులుగా కనిపించారు.

విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో వెంటనే కేశవులు.. పోలీసు స్టేషన్ కి వెళ్లి తనంతట తానే లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu