ఆస్తి కోసం అత్తను చంపిన మేనల్లుడు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 25, 2020, 09:17 AM IST
ఆస్తి కోసం అత్తను చంపిన మేనల్లుడు..

సారాంశం

ఆస్తి కోసం సొంత మేనత్తనే గొంతుకు బెల్టు బిగించి చంపాడో అల్లుడు. ఈ దారుణ ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగింది. ఈ కేసులో అన్నపురెడ్డి విజయలక్ష్మి (63) ని చంపిన నిందితుడైన మేనల్లుడు పప్పుల లింగారెడ్డిని సీఐ శేషగిరిరావు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐ శేషగిరిరావులు తెలిపారు. 

ఆస్తి కోసం సొంత మేనత్తనే గొంతుకు బెల్టు బిగించి చంపాడో అల్లుడు. ఈ దారుణ ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగింది. ఈ కేసులో అన్నపురెడ్డి విజయలక్ష్మి (63) ని చంపిన నిందితుడైన మేనల్లుడు పప్పుల లింగారెడ్డిని సీఐ శేషగిరిరావు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐ శేషగిరిరావులు తెలిపారు. 

అన్నపురెడ్డి విజయలక్ష్మి, మల్లారెడ్డి దంపతులకు పిల్లలు లేరు.  9 నెలల క్రితం అనారోగ్యంతో మల్లారెడ్డి చనిపోయాడు. ఆ సమయంలో మల్లారెడ్డి అన్న కొడుకు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు జరపడంతో విజయలక్ష్మి తన ఇంటిని అతడికి గిప్ట్  డీడ్ గా రాసి ఇచ్చారు. 

ఈ క్రమంలో రెండు నెలల క్రితం తాను ఇల్లు కట్టుకుంటున్నానని, అప్పటివరకు మేనత్త ఇంట్లో ఓ భాగంలో ఉంటానని పప్పుల లింగారెడ్డి వచ్చి ఉంటున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 1న విజయలక్ష్మి తన ఎకరం పొలాన్ని అమ్మేందుకు ఒకరి వద్ద బేరం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ. 3 లక్షలు తీసుకున్నారు. అందులో రూ. 2 లక్షలు తన అక్కకు, వారి పిల్లలకు ఇస్తానని బంధువులకు చెప్పారు. 

దీనిపై లింగారెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. వారం రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 19న ఇంటి వరండాలో నిద్రిస్తున్న విజయలక్ష్మి గొంతుకు బెల్టు వేసి బిగించి చంపేశాడు. 20న ఉదయం విజయలక్ష్మి అక్క కూతురు, మనవడు వచ్చి చూడగా మరణించి కనిపించారు. 

అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తాడికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు లింగారెడ్డిని అదుపులో తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. 2009లో జరిగిన రెండు హత్య కేసుల్లో లింగారెడ్డి జైలు శిక్ష అనుభవించాడని, అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి