ఆరేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం

Published : Sep 24, 2020, 11:04 AM IST
ఆరేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం

సారాంశం

పోలీసులు వెంటనే ఆ సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించారు. వాటిలో.. చిన్నారిని ఓ వ్యక్తి అపహరించి తీసుకువెళుతున్నట్లు గుర్తించారు.

ఆరేళ్ల చిన్నారిని ఓ 50ఏళ్ల వృద్ధుడు అపహరించాడు. అనంతరం ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  భిక్షాటన చేసుకుంటూ జీవించే కుటుంబానికి చెందిన ఆరేళ్ల చిన్నారి మంగళవాంర పేరేచర్ల జంక్షన్ కి వచ్చింది. కాగా.. తిరిగి ఆ చిన్నారి ఇంటికి చేరుకోలేదు. దీంతో.. రాత్రైనా చిన్నారి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా.. పోలీసులు వెంటనే ఆ సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించారు. వాటిలో.. చిన్నారిని ఓ వ్యక్తి అపహరించి తీసుకువెళుతున్నట్లు గుర్తించారు.

కాగా.. ఆ చుట్టుపక్కల గాలించగా.. చిన్నారి రైల్వేస్టేషన్ లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది. చిన్నారిని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  నిందితుడు గుంటూరు రూరల్ నల్లపాడుకు చెందిన స్వామిగా గుర్తించారు. పాపకు మాయమాటలు చెప్పి రైల్వే స్టేషన్ సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేతలింది. కాగా.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?