భార్య చనిపోయిందని.. భర్త నగ్నంగా ఇంట్లో...

By ramya NFirst Published Apr 4, 2019, 10:55 AM IST
Highlights

భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికి మరొకరుగా బతికిన జంటలో ఒకరు దూరమైతే మరొకరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. 

భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికి మరొకరుగా బతికిన జంటలో ఒకరు దూరమైతే మరొకరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. భార్య అనారోగ్యంతో కన్నుమూయడంతో.. ఆమెను కోల్పోయిన భర్త పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. పేరుకి ఆస్తులు ఉన్నా పట్టించుకునేవారు లేక.. కనీసం ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పడి ఉన్నాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా నరసారావుపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నరసారావుపేటకు చెందిన జయరామ్(65)కి మంచి సిరిగల కుటుంబం. భార్య విశ్రాంత ఉపాధ్యాయుని. ఆరు నెలల క్రితం కన్నుమూసింది. వీరికి సంతానం కూడా లేదు. దీంతో ఒకరికి మరొకరు అన్న విధంగా జీవనం సాగించేశారు. అకస్మాత్తుగా భార్య చనిపోవడంతో జయరామ్ ఒంటరివాడు అయ్యాడు.

పట్టణంలోని మునిసిపల్‌ హై స్కూల్‌ పక్కవీధిలో గల మూడు అంతస్తుల భవనంలో బందీగా ఉంటున్నాడు. వంటిపై దుస్తులు కూడా లేవు. జయరామ్‌ భార్య సోదరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యా యినిగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె పట్టణంలోని పల్నాడు రోడ్డులో యర్రంశెట్టి మోటార్స్‌ వద్ద నివశిస్తూ దుర్గిలో పాల్‌టెక్ని క్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా రు.
 
వీరికి జయరామ్‌ ఆస్తులపై ఆసక్తేగాని అతని బాగోగులు, సంక్షేమం చూడటమే మానివేశారు. ఓ వ్యక్తికి రోజుకు వంద రూపా యల చొప్పున మాట్లాడుకొని జయరామ్‌కు రెండుపూటలా అల్పాహారం సమకూర్చేలా మాత్రమే చర్యలు తీసుకున్నారు. జయరామ్‌ తన పని తాను చేసుకోలేని పరిస్థితి ఉండటం తో రోజుల తరబడి స్నానం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

అతని దీనావస్థను గమనించి చుట్టుపక్కల వారు పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఇదే విషయమై వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ దృష్టికి న్యాయ సహాయకుడు రజాక్‌ ద్వారా తీసుకువెళ్ళారు. ఈ సమస్యపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేసుకొనేలా ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్తానని, సంబంధితుల పై తగు చర్యలు తీసుకొని జయరామ్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

click me!