గుంటూరులో మరో కీచకుడు: మార్ఫింగ్ ఫోటోలతో పది మంది మహిళలకు బెదిరింపులు

Siva Kodati |  
Published : Jul 15, 2020, 08:24 PM ISTUpdated : Jul 15, 2020, 08:26 PM IST
గుంటూరులో మరో కీచకుడు: మార్ఫింగ్ ఫోటోలతో పది మంది మహిళలకు బెదిరింపులు

సారాంశం

గుంటూరులో సంచలనం కలిగించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని మార్ఫింగ్ వీడియోల వ్యవహరం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. రఘునాథ్ అనే వ్యక్తి ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు

గుంటూరులో సంచలనం కలిగించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని మార్ఫింగ్ వీడియోల వ్యవహరం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. రఘునాథ్ అనే వ్యక్తి ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్ ఫోటోలతో యువతిని బెదిరించాడు. న్యూడ్ ఫోటోలు పంపకపోతే.. మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. రఘుబాబు ఇదే తరహాలో పది మంది మహిళలను బెదిరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

తొమ్మిది నెలలుగా మార్ఫింగ్ ఫోటోలతో మహిళలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వేధింపులు భరించలేకపోయిన ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు.

తొలుత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. ఆ తర్వాత వారి ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకునేవాడు. వాటిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోల సాయంతో బెదిరింపులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు