దారుణం : తల, మొండెం వేరు చేసి, గోనెసంచిలో కుక్కి.. చెరువులో పడేసి...

Published : Dec 30, 2020, 10:09 AM IST
దారుణం : తల, మొండెం వేరు చేసి, గోనెసంచిలో కుక్కి.. చెరువులో పడేసి...

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బొమ్మూరు పోలీసు స్టేషనులో వ్యక్తి అదృశ్యం కేసుగా నమోదైన ఈ యువకుడు మండలంలోని భూపాలపట్నం చెరువులో శవమై తేలాడు. తల, మొండెం వేరు చేసి, గోనెసంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ మృతదేహాన్ని చూసిన స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. 

వ్యక్తిగత కక్షలో, మరో కారణమో తెలియదుగానీ ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది.

ఈ సంఘటన వివరాలను మంగళవారం రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ చెప్పిన వివరాల ప్రకారం.. భూపాలపట్నం శివారులోని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శాంతిపురానికి చెందిన రొంగలి దుర్గాప్రసాద్‌(22)గా గుర్తించారు. ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని దుర్గా ప్రసాద్ తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో విరోధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu