దొంగతనం చేశాడని.. కొట్టి చంపారు!

Published : Sep 03, 2020, 10:06 AM ISTUpdated : Sep 03, 2020, 10:30 AM IST
దొంగతనం చేశాడని.. కొట్టి చంపారు!

సారాంశం

అదే గ్రామానికి చెందిన దొర  వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రూ.6వేలు కనిపించకుండా పోయాయి. కాగా.. ఆ డబ్బులను తిరుపతయ్య దొంగతనం చేశాడంటూ వారు ఆరోపించారు.

దొంగనతం చేశాడని ఓ వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పొగుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన దొర తిరుపతయ్య(55) మద్యానికి బానిసయ్యాడు. అయితే.. ఆ మద్యం కొనుగోలుకు డబ్బుల కోసం దొంగతనం చేశాడనే ఆరోపణలు అనిపై వచ్చాయి.

అదే గ్రామానికి చెందిన దొర  వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రూ.6వేలు కనిపించకుండా పోయాయి. కాగా.. ఆ డబ్బులను తిరుపతయ్య దొంగతనం చేశాడంటూ వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే తిరుపతయ్యను.. వెంకటేశ్వర్లు, అతని కుమారుడు ఖర్జూరనాయుడు దారుణంగా కొట్టారు. 

తీవ్రగాయాలు కావడంతో.. తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?