అన్నమయ్య జిల్లా : బాలికపై అత్యాచారయత్నం, యువకుడిని కొట్టి చంపిన మైనర్ బంధువులు

Siva Kodati |  
Published : May 21, 2023, 07:45 PM IST
అన్నమయ్య జిల్లా : బాలికపై అత్యాచారయత్నం, యువకుడిని కొట్టి చంపిన మైనర్ బంధువులు

సారాంశం

అన్నమయ్య జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన యువకుడిని బాధితురాలి బంధువులు కొట్టి చంపారు

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది.  మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన యువకుడిని బాధితురాలి బంధువులు కొట్టి చంపారు. గుర్రంకొండ మండలం పసలబండ్లలో ఈ ఘటన జరిగింది. మైనర్ బాలికపై ఉత్తన్న అనే యువకుడు అత్యాచారయత్నం చేస్తుండగా.. ఆమె తిరగబడింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఉత్తన్న బాలిక తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రగాయాల పాలైంది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక బంధువులు ఉత్తన్నను కొట్టి చంపారు. బాలికను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు ఉత్తన్న గతంలో రెండు కేసుల్లో నిందితుడిగా వున్నట్లుగా తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu