క్షణికావేశంలో ఓ యువకుడు తన భార్య గొంతును బ్లేడ్ తో కోసిన ఘటన గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయపాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు.

12 యేళ్ల క్రితం వివాహమైన వారి మధ్య ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనను లెక్క చేయడం లేదన్న అక్కసుతో గనున్ భార్య రీటా మీద ఆదివారం బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు.
స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. యడ్లపాటు ఎస్ఐ పైడి రాంబాబు సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి బాధితురాలు రీటాను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇంత జరిగినా తన భర్తపై ఫిర్యాదు చేయనని, స్టేషన్ కు తీసుకెళ్లకుండా అతడిని విడిచి పెట్టాలని ఎస్ఐను రీటా కోరడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఓ వివాహితుడు మాయమాటలతో బాలికను మభ్యపెట్టి, పెళ్లి చేసుకుని, లైంగిక దాడి చేసిన ఘటనపై కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం వేమూరులో ఈ దారణం జరిగింది.
పోలీసుల కథనం మేరకు మండలంలోని దోనేపూడి శివారు గ్రామానికి చెందిన బాలిక భట్టిప్రోలులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రైన 35 ఏళ్ల కూచిపూడి శ్రీను అనే వ్యక్తి... కొన్నేళ్లుగా ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు.