తీసుకున్న బాకీని తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై అత్యంత పైశాచికంగా ప్రవర్తించాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ వీధికి చెందిన రత్నం అనే మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు.

దీంతో కుటుంబాన్ని పోషించేందుకు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద పకోడి, బజ్జీల దుకానం నిర్వహిస్తోంది. ఇందుకు పెట్టుబడి కోసం ఆమె పాడేరుకు చెందిన పెంటారావు అనే వ్యక్తి వద్ద రోజువారీ కింద రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఇందులో రూ.10,600 ఇప్పటి వరకు చెల్లించింది.
అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా రత్నం దుకాణం తెరవడం లేదు. దీంతో పెంటారావు తన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 15న పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో మరోసారి రత్నం బజ్జీల దుకాణం వద్దకు వచ్చిన అతను మళ్లీ గొడవ పడ్డాడు. బజ్జీలు, పకోడీలు వేసే వేడి వేడి నూనెలో ఆమె తలను ముంచేశాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు రత్నాన్ని ఆసుపత్రికి తరలించారు. సుమారు 50 శాతం చర్మం కాలిపోవడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు పెంటారావుపై కేసు నమోదు చేశారు.