విషాదం: మహర్షి ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని మృతి

Published : May 09, 2019, 07:20 AM IST
విషాదం: మహర్షి ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని మృతి

సారాంశం

గురువారం మహర్షి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహర్షి సినిమా ఫ్లెక్సీ కడుతూ అతను ప్రమాదశాత్తు విద్యుత్ తీగలపై పడ్డాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. 

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో మురళీకృష్ణ థియేటర్ వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు హీరో మహేష్ బాబు అభిమాని మృతి చెందారు. 

గురువారం మహర్షి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహర్షి సినిమా ఫ్లెక్సీ కడుతూ అతను ప్రమాదశాత్తు విద్యుత్ తీగలపై పడ్డాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతుడిని ధవళేశ్వరం ఇండస్ట్రీయల్ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి రాజీవ్‌గా గుర్తించారు. మహర్షి సినిమా గురువారం విడుదలై అభిమానులకు విందు చేస్తున్న సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది.

PREV
click me!

Recommended Stories

Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?