
మొత్తం మీద ప్రకాశం జిల్లాలో మినీమహానాడు ప్రశాంతంగా జరిగింది. నిన్నటి నుండి కార్యక్రమ నిర్వహణపై ఆందోళనలో ఉన్న జిల్లా, రాష్ట్ర పార్టీనాయకత్వంతో పాటు పోలీసులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. కార్యక్రమానికి హాజరైన వారి సంఖ్య 1100 అయితే, పోలీసులే 730 మంది ఉన్నారు. దాన్నిబట్టే మహానాడు కార్యక్రమానికి ఎంతటి బందోబస్తు ఏర్పాటు చేసారో అర్ధం అవుతోంది.
జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం-గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య పెరిగిపోయిన ఘర్షణలతో జిల్లా పార్టీ భయపడిపోయింది. మొన్ననే గొట్టిపాటిని కరణం క్రిందపడేసి కొట్టారు. దాంతో గొట్టిపాటి మండిపోతున్నారు. ఇంతలో మినీమహానాడు నిర్వహించాల్సి రవాటంతో కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించటమన్నది ఇతర నేతలకు సవాలుగా మారింది. దాంతో కరణం, గొట్టిపాటి ఇద్దరూ హాజరయ్యే కార్యక్రమం కాబట్టి పోలీసులు భారీగా మోహరించారు. అడిషినల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఇలా కన్వెన్షన్ హాలు లోపలా, బయట మొత్తం 730 మంది మోహరించారు. మొత్తానికి పోలీసు బందోబస్తు మధ్య మహానాడు ప్రశాంతంగా ముగిసింది.