దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైనది. మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. రెడ్డి, కమ్మ, ముస్లిం మైనారిటీ నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
అన్నమయ్య జిల్లాలో అతిపెద్ద పట్టణం.. మదనపల్లె. వర్తక , వాణిజ్యాలకు ఈ పట్టణం కేంద్రంగా విలసిల్లుతోంది. ముఖ్యంగా టమోటా, ఉల్లి, మిరప మార్కెట్లు మదనపల్లె నుంచి లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతులు ఇక్కడ అలరారుతున్నాయి. దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైనది. మదనపల్లె కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మదనపల్లె వాసులకు ఆగ్రహం తెప్పించింది. రెడ్డి, ముస్లిం మైనారిటీ, బలిజ కమ్యూనిటీ ఓటర్లదే ఇక్కడ ఆధిపత్యం.
వర్తక, వాణిజ్యాలకు కేంద్రం :
undefined
మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,46,132 మంది. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు మదనపల్లె కేంద్రం. కాంగ్రెస్ పార్టీ.. 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ, సీపీఐలు రెండేసి సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి. రెడ్డి, కమ్మ, ముస్లిం మైనారిటీ నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :
వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాను కాదని.. నిసార్ అహ్మద్‌కు టికెట్ కేటాయించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ టికెట్‌ను షాజహాన్ భాషాకు చంద్రబాబు కేటాయించారు. నవాజ్ భాషాకు సొంత అన్ననే షాజహాన్ భాషా.