ముమ్మిడివరం రాజకీయాలు : ముమ్మిడివరం అసెంబ్లీలో అటు అదికార వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపి రెండూ బలంగానే వున్నాయి. అయితే వైసిపి ఒంటరిగా పోటీచేస్తుంటే టిడిపి మాత్రం ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పడి పోటీచేసింది. ఇక ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న గతంలో కాంగ్రెస్ నుండి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు పొన్నాడ. ఇలా ముమ్మిడివరంలో బలమైన క్యాడర్ కలిగిన ఆయన మరోసారి వైసిపి నుండి బరిలో నిలిచారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు బరిలో నిలిచారు.
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ఐ పోలవరం
2. తాళ్లరేవు
3. ముమ్మిడివరం
4. కాట్రేనికోన
ముమ్మిడివరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,29,600
పురుషులు - 1,15,154
మహిళలు - 1,14,443
ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ నే మళ్లీ ముమ్మిడివరం బరిలో నిలిచారు. వైసిపి.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజును ముమ్మిడివరం బరిలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనా మరోసారి అతడిపై నమ్మకం వుంచింది టిడిపి అదిష్టానం.
ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ;
ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) విజయం సాధించారు. ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌పై 118687 ఓట్లతో విజయం సాధించారు.
ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,92,043
వైసిపి - పొన్నాడ వెంకట సతీష్ - 78,522 (40 శాతం) - 5,547 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - దాట్ల సుబ్బరాజు - 72,975 (38 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - పితాని బాలకృష్ణ - 33,334 (17 శాతం)
ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,378 (83 శాతం)
టిడిపి - దాట్ల సుబ్బరాజు - 99,274 (56 శాతం) - 29,538 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు - 68,736 (39 శాతం) - ఓటమి