పవిత్రమైన పాఠశాలలోనే రాసలీలలు... సోషల్ మీడియాలో ప్రిన్సిపల్ అసభ్య వీడియోలు

Published : Dec 18, 2022, 10:13 AM IST
పవిత్రమైన పాఠశాలలోనే రాసలీలలు... సోషల్ మీడియాలో ప్రిన్సిపల్ అసభ్య వీడియోలు

సారాంశం

బాధ్యతాయుతంగా వుంటూ విద్యార్థులకు ఆదర్శంగా వుండాల్సిన ప్రిన్సిపాల్ పవిత్రమైన పాఠశాలలోనే పాడుపని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు, ఈ దారుణం మచిలీపట్నంలో వెలుగుచూసింది. 

మచిలీపట్నం : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే బుద్దితక్కువ పని చేసాడు. బాధ్యతాయుతంగా వుండాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ పవిత్రమైన సరస్వతి నిలయంలోనే రాసలీలలకు దిగాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే పాఠశాలలో పనిచేసే ఉద్యోగినితో ప్రిన్సిపాల్ సన్నిహితంగా వుండేవాడు. తాజాగా ఈ రాసలీలల వీడియోలు బయటకు రావడంతో సదరు ప్రిన్సిపాల్ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... మచిలీపట్నంలోని ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆనంద్ కుమార్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే పాఠశాలలో పనిచేసే ఉద్యోగినితో ఇతడు సన్నిహిత సంబంధాలను కలిగివున్నాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే పాఠశాలలోనే ఆమెతో రాసలీలలకు దిగేవాడు. ఆమె ఎలా చెబితే అలా చేస్తుండటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యేవారు. విద్యార్థుల ముందు పాడుపనులు చేయవద్దన్న ఇంగితం కూడా లేకుండా ప్రిన్సిపల్ నీచంగా వ్యవహరించేవాడు. 

Read More  మహిళ రేప్ చేసినట్టు మైనర్ బాలిక ఫిర్యాదు.. ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

అయితే ఇలా ప్రిన్సిపల్ ఉద్యోగినితో సన్నిహితంగా వున్న వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ గా మారాయి. దీంతో అటు విద్యాశాఖ అధికారులు ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురయ్యాడు ప్రిన్సిపల్. చిన్నారుల ముందే నీచంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు చేపట్టింది విద్యాశాలు. ప్రిన్సిపల్ రాసలీలల వీడియోలను పరిశీలించిన డివైఈవో సుబ్బారావు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి వివరాలను సేకరించి నివేదికను ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శికి అందించారు. 

తప్పుచేసిన ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ పై చర్యలు తీసుకుంటామని ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ కార్యదర్శి ఉబేదుల్లా తెలిపారు. ఆయన మచలీపట్నం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu