తెనాలిలో అర్ధరాత్రి అలజడి... అన్నా క్యాంటిన్ కు నిప్పంటించిన దుండగులు

By Arun Kumar PFirst Published Dec 18, 2022, 8:35 AM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెనాలిలో ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ఇప్పటికే మూతపడగా తాజాగా కాల్చిబూడిద చేసేందుకు ప్రయత్నించారు కొందరు గుర్తుతెలియని దుండగులు. 

అమరావతి : గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడి ఆకలిబాధ తీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్లను వైసిపి అధికారంలోకి రాగానే మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకు ప్రజలతో కిటకిటలాడిన అన్నా క్యాంటిన్లు కొన్నిప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారితే మరికొన్నిచోట్లు నామరూపాల్లేకుండా మాయమైపోయాయి. తాజాగా ఇలాగే అన్నా క్యాంటిన్ ను కొందరు దుండగులు నిప్పంటికి కాల్చిబూడిద చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

తెనాలి పట్టణంలో టిడిపి అధికారంలో వుండగా అన్నా క్యాంటిన్ ను ఏర్పాటుచేసారు. అయితే వైసిపి పాలనలో అన్ని అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ఇదికూడా మూతపడింది.  తాజాగా ఈ క్యాంటిన్ నామరూపాలే లేకుండా చేయాలని భావించారో ఏమో అర్ధరాత్రి నిప్పంటించి కాలిబూడిద చేసే ప్రయత్నం చేసారు. కానీ మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి ఆర్పివేసారు.  

అన్నా క్యాంటిన్ కు నిప్పంటిచిన ఘటనపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని భయపడే అన్నా క్యాంటిన్లను వైసిపి ప్రభుత్వం మూసివేసిందని... ఇప్పుడు వాటి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని టిడిపి నేతలు వాపోయారు. పేదవాడి ఆకలిబాధను తీర్చే అన్నా క్యాంటీన్లుతో రాజకీయాలు తగదని... వైసిపి ప్రభుత్వం అన్నా క్యాంటిన్లకు రక్షణ కల్పించి తిరిగి తెరవాలని టిడిపి నాయకులు సూచిస్తున్నారు. 

Read More  మాచర్ల హింస.. 9 మందిపై హత్యాయత్నం కేసులు, ఏ1గా టీడీపీ నేత బ్రహ్మారెడ్డి

ఇటీవల తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని టిడిపి నేతలు భావించారు. అయితే ఆహారం కోసం భారీగా ప్రజలు గుమిగూడే అవకాశాలుంటాయి కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికి వెనక్కి తగ్గని టిడిపి ఉద్రిక్తతల మధ్యే క్యాంటిన్ వద్ద పేదలకు భోజనాన్ని పంపిణీ చేసారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా అన్నా క్యాంటీన్ ను నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆహారం తెచ్చే వాహనాన్ని మధ్యలోనే ఆపేశారు. దీంతో పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే చివరకు పోలీసులు అన్నా క్యాంటీన్ ను మూసివేయించారు. 
 

click me!