మరో నెలరోజులు సెలవు తీసుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

Published : Dec 09, 2019, 08:49 AM ISTUpdated : Dec 09, 2019, 08:58 PM IST
మరో నెలరోజులు సెలవు తీసుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

సారాంశం

ఆయన తన సుదీర్ఘ ఐఏఎస్‌ జీవితానికి సంబంధించి ఒక పుస్తకం రాయబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ ఆయనకు లేదని ఎల్వీ సన్నిహితులు చెబుతున్నారు.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మరో నెలరోజుల పాటు సెలవు తీసుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను గత నెల 4వ తేదీన హఠాత్తుగా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వన రుల అభివృద్ధి సంస్థ డైరక్టర్‌ జనరల్‌గా బదిలీ చేశారు. అయితే ఆయన అప్పటి నుంచి సెలవులో ఉన్నారు. 

తొలుత నెలరోజులు సెలవు పెట్టారు. సెలవు ఇటీవలే ముగిసినా ఆయన బాధ్యతలు చేపట్టలేదు. మరో నెలరోజుల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఆయన తన సుదీర్ఘ ఐఏఎస్‌ జీవితానికి సంబంధించి ఒక పుస్తకం రాయబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ ఆయనకు లేదని ఎల్వీ సన్నిహితులు చెబుతున్నారు.

గత నెలలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం బదిలీ చేసింది.  బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా కొత్త బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఆ బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై వెళ్లారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. సీఎస్‌ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి ( హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

సీఎన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం, అధికార, రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. కాగా.. ఆయన వెంటనే సెలవు తీసుకున్నారు. ఇప్పుడు ఆ సెలవు ముగిసి విధుల్లోకి చేరాల్సిన సమయం రాగా... మరో నెల సెలవు తీసుకోవడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్