అనంతలొో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

Published : Apr 21, 2019, 12:09 PM ISTUpdated : Apr 21, 2019, 12:14 PM IST
అనంతలొో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

సారాంశం

అనంతపురం జిల్లాలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై కారణాలు అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై కారణాలు అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు.

అనంతపురం జిల్లా మల్లికార్జునది పుట్లూరు మండలం బాలాపురం గ్రామం. మాధవిది బెలుగుప్ప మండలం. బాలాపురానికి పక్కనే ఉన్న కోమటికుంటలో ఉన్న అమ్మమ్మ ఊరులో ఉంటూ మాధవి చదువుకుంటుంది. ఈ సమయంలోనే వీరిద్దరి  పరిచయం ప్రేమగా మారింది

వీరిద్దరూ తరచూ కలుసుకొనేవారు.  శనివారం సాయంత్రం తాడిపత్రిలో కలుసుకొన్నారు. ఏమైందో కానీ  వారిద్దరూ తాడిపత్రిలో పురుగుల మందు తాగారు. పురుగుల మందు తాగడం వల్ల కడుపులో మంట తీవ్రం కావడంతో  వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. 

చికిత్స పొందుతూ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?