కోట్లు పంచినా గెలిచేది టీడీపీయే, 100 సీట్లు పక్కా: సోమిరెడ్డి

By Nagaraju penumalaFirst Published Apr 20, 2019, 5:55 PM IST
Highlights

అమరావతిలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోట్లు ఖర్చుపెట్టారని చెప్పుకొచ్చారు. దాదాపు 150 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారని ఆరోపించారు. 
 

అమరావతి: ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు కుమ్మరించినా అధికారంలోకి వచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీయేనని చెప్పుకొచ్చారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోట్లు ఖర్చుపెట్టారని చెప్పుకొచ్చారు. దాదాపు 150 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారని ఆరోపించారు. 

వైసీపీ కోట్లు ఖర్చుపెట్టినా తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని 100 సీట్లు పక్కా అంటూ జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబు సమీక్షలపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా సీఎం సమీక్షలు చేయోచ్చని ఈసీనే చెప్తోందన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ లకు ఈసీ నిబంధనలు వర్తించవా అంటూ మండిపడ్డారు. బీజేపీలో ఉంటే తప్ప ఎవరూ వ్యాపారాలు చేసుకోవద్దా అని నిలదీశారు సోమిరెడ్డి. చంద్రబాబు పేరు వింటే మోదీకి నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. 

ఏపీలో ఈ ఎన్నికలు ఈసీకి మాయని మచ్చగా మిగిలిపోతాయన్నారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేస్తే ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందా అని ప్రశ్నించారు. 72 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. వీవీ ప్యాట్లు లెక్కించేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

click me!