పరువు పేరుతో ప్రేమ జంటకు వేధింపులు

By rajesh yFirst Published Sep 18, 2018, 7:20 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులను పరువు పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు యవతి బంధువులు. 

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులను పరువు పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు యవతి బంధువులు. యువకుడిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతన్నారు. అయితే ప్రణయ్ హత్యకు గురవ్వడంతో ఆందోళన చెందిన ఆ ప్రేమ జంట  పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. 

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన బండి దీప్తి రెడ్డి, కడపకు చెందిన విజయ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈఏడాది జూలై 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లి విషయం దీప్తిరెడ్డి ఇంట్లో తెలియడంతో అప్పటి నుంచి విజయ్‌ను చంపేస్తామంటూ దీప్తి రెడ్డి బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రోజూ ఈ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో భయభ్రాంతులకు గురైన దీప్తిరెడ్డి, విజయ్ దంపతులు డీజీపీని  కలిశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.  

తమ బంధువుల్లో కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత పదవుల్లో ఉన్నారని వారు తమను బెదిరిస్తున్నారని దీప్తి రెడ్డి తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లినా ఎవరికి ఫోన్ చేసినా ట్రేస్ చేసి ఇబ్బందులుకు గురి చేస్తున్నారని వాపోయింది. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వేరే వారికి ఫోన్ చేస్తే అడ్రస్ ట్రేస్ చేసి తాము ఉన్నచోటుకు వచ్చి నానా రభస చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

తాము ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి ఆ ఇంట్లో వాళ్లపై దౌర్జాన్యానికి దిగుతున్నారని నవ దంపతులు వాపోయారు. మూడు నెలలుగా తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. పోలీస్ శాఖలో తమ బంధువులు ఉండటంతో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగదని భావించి మీడియాను ఆశ్రయించినట్లు నవ దంపతులు తెలిపారు.

మిర్యాలగూడలో ప్రణయ్ తరహాలో విజయ్ ను కూడా చంపుతారేమోనని భయంగా ఉందని దీప్తి రెడ్డి వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని మెురపెట్టుకున్నారు.  

click me!