15ఏళ్ల క్రితం ప్రేమ.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఒకరినొకరు మర్చిపోలేక...

Published : Sep 24, 2021, 07:27 AM IST
15ఏళ్ల క్రితం ప్రేమ.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఒకరినొకరు మర్చిపోలేక...

సారాంశం

కరోనా కారణంగా కుటుంబం గడవడం కష్టంగా ఉండటంతో ఏడాది క్రితం నాగలక్ష్మీ భర్తను తీసుకొని స్వగ్రామమైన ఇస్సపాలెంకు వచ్చింది. ఇక్కడే ఉంటూ పలువురికి టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ జీవనం సాగించేంది.

వారిద్దరిదీ ఒకే గ్రామం. యుక్త వయసులో ఉన్న సమయంలో ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డారు. కానీ.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెద్దల బలవంతం మేరకు వేర్వేరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.  అయినా వారి మనసులో ప్రేమ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఈ క్రమంలో.. దాదాపు 15ఏళ్ల తర్వాత వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసారావుపేట లో చోటుచేసుకోగా,, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామానికి చెందిన కాళేశ్వరరావు(45), బత్తుల నాగలక్ష్మీ(40) లు15ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించకపోవడంతో విడిపోయారు. దీంతో.. కాళేశ్వరరావుకు గుంటూరుకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. నాగలక్ష్మీకి నరసరావు పేట పట్టణానికి  చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది.

కాళేశ్వరరావు గ్రామంలోనే ఉంటూ తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక నాగలక్ష్మీ నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువులో నివాసం ఉండేది. భర్త టైలర్. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కరోనా కారణంగా కుటుంబం గడవడం కష్టంగా ఉండటంతో ఏడాది క్రితం నాగలక్ష్మీ భర్తను తీసుకొని స్వగ్రామమైన ఇస్సపాలెంకు వచ్చింది. ఇక్కడే ఉంటూ పలువురికి టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ జీవనం సాగించేంది.

ఈ క్రమంలో కాళేశ్వరావు, నాగలక్ష్మిల మధ్య పాత ప్రేమ చిగురించింది. గతంలో వారు కలిసి  జీవించాలని అనుకున్న విషయం గుర్తుకు వచ్చింది. కనీసం కలిసి బతకకపోయినా... కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?