ఒకే తాడుకు ఉరేసుకుని సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే

Published : Jan 30, 2021, 11:15 AM IST
ఒకే తాడుకు ఉరేసుకుని సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే

సారాంశం

నెల్లూరు జిల్లాలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఓ లాడ్జిలో ఒకే తాడుకు ఉరేసుకుని మరణించారు. ప్రేమ వ్యవహారమే వారి ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు శివారులో గల పడారుపల్లి లాడ్జిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని హరీష్, లావన్యలుగా గుర్తించారు. ఒకే తాడుకు ఉరి వేసుకుని వారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని భావిస్తున్నారు. 

నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. నాయుడుపేటకు చెందిన లావణ్ అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తోంది. వారిద్దరు కూడా శుక్రవారం విధులకు హాజరు కాలేదు. 

నెల్లూరు నగర శివారులో గల నందా లాడ్జిలో వారు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వారిద్దరు ఆ గదిలో ఒకే తాడుకు ఉరేసుకుని మరణించారు రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో హరీష్, లావణ్యల కుటుబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చిది. ఈ ఘటనపై అర్థరాత్రి దాటే వరకు కూడా పోలీసులకు ఏ విధమైన సమాచారం లేదు. 

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కొడవలూరులో హరికృష్ణ అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు.

PREV
click me!

Recommended Stories

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar