క్యాన్సర్ తో భార్య మృతి.. మజాలో ఎలుకలమందు కలిపి.. తండ్రి ఇద్దరు పిల్లలు...

By AN TeluguFirst Published Jan 30, 2021, 9:37 AM IST
Highlights

భార్య మృతి తట్టుకోలేక మజాలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త. తను తాగడమే కాకుండా తన ఇద్దరు పిల్లలకూ తాగించాడు. ఒక పిల్లాడు చనిపోగా మరో పిల్లాడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. 

భార్య మృతి తట్టుకోలేక మజాలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త. తను తాగడమే కాకుండా తన ఇద్దరు పిల్లలకూ తాగించాడు. ఒక పిల్లాడు చనిపోగా మరో పిల్లాడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. ఒంగోలు మిలటరీ కాలనీకి చెందిన తన్నీరు అంకమ్మ రాజు (36) బేల్దారి కూలి పనులు చేస్తూ జీవిస్తాడు. అంకమ్మరాజు భార్య కల్యాణి క్యాన్సర్ కారణంగా గత సంవత్సరం చనిపోయింది. అప్పట్నుండి తండ్రి, ఇద్దరు కొడుకులు బతకడం కష్టంగా మారింది. 

వీరిద్దరి పిల్లలు పెద్ద కుమారుడు వంశీకృష్ణ ఆరో తరగతి, చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) ఐదో తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా స్కూల్స్ మూత పడడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. 

దీనికితోడు గత రెండు నెలలుగా రాజు పనికి వెళ్లడం లేదు. తన దగ్గరున్న డబ్బుతోనే వెళ్లదీస్తున్నాడు. ఈ గురువారం తెల్లవారుజామున రాజు తన తమ్ముడు మధుకు ఫోన్‌చేశాడు. తాను, తన ఇద్దరు పిల్లలు మజా బాటిల్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగామని, ఆత్మహత్య చేసుకున్నామని తెలిపాడు. రాజు ఇంటికి దగ్గర్లోనే ఉండే మధు ఈ విషయం విని హడావుడిగా పరిగెత్తుకుని వచ్చాడు. మధు వచ్చేసరికి ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు.

వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ రాజు మృతిచెందాడు. ఇక పిల్లలిద్దరిలో చిన్నకొడుకు ముకుంద కృష్ణ (11) పరిస్థితి విషమంగా ఉండడంతో బైపాస్‌ దగ్గర్లోలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన కొద్దిసేపటికే కృష్ణ చనిపోయాడు. 

ఇక పెద్ద కొడుకు వంశీకృష్ణ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అతన్నివెంటనే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. పెద్ద కొడుకు వంశీకృష్ణ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటే గానీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

click me!