పెళ్లైన వాడితో ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..!

Published : Jul 27, 2021, 09:20 AM IST
పెళ్లైన వాడితో ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..!

సారాంశం

ఇద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో.. వారు ఇద్దరినీ తప్పుపట్టారు

అతనికి అప్పటికే పెళ్లైంది. ఆ విషయం తెలిసి కూడా.. అతనిపై ఆమె మోజు పడింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో.. వారు ఇద్దరినీ తప్పుపట్టారు. దీంతో.. దూరంగా బతకలేమంటూ.. ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక మేలుపట్లకు చెందిన ఫీయాజ్‌(25), స్థానిక కొత్తయిండ్లులోని ఓ దుకాణంలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి నాన బాలవీధికి చెందిన నదియాతో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో ఫీయాజ్‌ తనతో పాటు పనిచేస్తున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరూ ఇళ్లు వదలి కర్ణాటక రాష్ట్రంలోని మురగమలై పారిపోయారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలవారు వెళ్లి వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్‌ చేరకముందే వారు ఎలుకల మందు తాగేశారు. పోలీసులు గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?