ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లోకేష్

Published : Jun 04, 2018, 12:15 PM IST
ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లోకేష్

సారాంశం

వైరల్ అవుతున్న లోకేష్ ట్వీట్

దేశ ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ చేసిన ట్వీట్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే..జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ  మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

 

కాగా..  ఆట్వీట్ కి సమాధానంగా  లోకేష్ మరో ట్వీట్ చేశారు. భజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా?. కేంద్రం హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచాలని మీరు అనుకుంటున్నారా?. ప్రజల ఆవేదన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నానని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని లోక్‌శ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Anitha Praises Woman Constable: జన్నాల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచావ్ తల్లి | Asianet News Telugu
CM Chandrababu Naidu Speech: 6కి.మీ. నడిచి స్కూల్ కి వెళ్ళా చంద్రబాబు ఎమోషనల్| Asianet News Telugu