నంద్యాలకు వెళుతున్న లోకేష్

Published : Jul 10, 2017, 03:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నంద్యాలకు వెళుతున్న లోకేష్

సారాంశం

మంత్రులు, నేతలతో సమన్వయం చేసేందుకే లోకేష్ నంద్యాలకు వెళుతున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చంద్రబాబునాయుడు తరపున లోకేష్ నియోజకవర్గ బాధ్యతలను మోస్తున్నారు.

నంద్యాల ఉపఎన్నికపై నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేకించి లోకేష్ మొదటిసారిగా నంద్యాలలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియలు చేస్తున్న ప్రచారం సరళి, జనాల రెస్పాన్స్ ను పరిశీలిస్తారట. మంత్రులు, నేతలతో సమన్వయం చేసేందుకే లోకేష్ నంద్యాలకు వెళుతున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చంద్రబాబునాయుడు తరపున లోకేష్ నియోజకవర్గ బాధ్యతలను మోస్తున్నారు. గడచిన మూడేళ్ళుగా నియోజకవకవర్గంలో అమలు చేసిన పథకాలు, మొన్ననే ఉపఎన్నిక కోసం మంజూరు చేసిన నిధులు, కావాల్సిన నిధులు తదితరాలపై కూడా లోకేష్ మంత్రులు, నేతలతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
గన్నవరం ప్రజలకు బిగ్ రిలీఫ్ స్పాట్ లోనే పట్టాలు | Chandrababu Key Decision on 22A Lands