ఏపీలో అధికారం టీడీపీదా? వైసీపీదా? లోకేష్ కౌంటర్

Published : Jul 02, 2019, 03:26 PM IST
ఏపీలో అధికారం టీడీపీదా? వైసీపీదా? లోకేష్ కౌంటర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో అధికారం వెలగపెడుతోంది టీడీపీ నా? వైసీపీ నా అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.  

ఆంధ్రప్రదేశ్ లో అధికారం వెలగపెడుతోంది టీడీపీ నా? వైసీపీ నా అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

వైసీపీ అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. ‘‘విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే!
చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు. ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు నిల‌దీస్తే! గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇస్తున్నారు.’’ అంటూ మండిపడ్డారు.

‘‘బీమా రాలేదు..మా బ‌తుకుల ధీమా ఏదీ అంటే! తెలుగుదేశం స‌ర్కారు వ‌ల్లే అంటూ మాట దాట‌వేస్తున్నారు.
నేను విన్నాను.. నేను ఉన్నానంటూ..  సీఎం అయ్యి, పాలన చేతకాక,  ఇప్పుడు చంద్ర‌బాబే వింటాడు, చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైసీపీనా, టీడీపీనా’’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.

ప్రతి విషయంలోనూ ఏపీ మంత్రులు... గత టీడీపీ ప్రభుత్వం వల్లనే అంటూ గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ పై విధంగా స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?