మంత్రి నారాయణ ఇంట్లో బాలకార్మికులు: ముగ్గురికి విముక్తి

By Nagaraju penumalaFirst Published Apr 19, 2019, 3:59 PM IST
Highlights

జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 46లో ఉన్న మంత్రి నారాయణకు చెందిన ఇంట్లో బాలకార్మికులు ఉన్నట్లు కార్మికశాఖకు, బాలల సంరక్షణాధికారులకు, జిల్లా కమిషనర్, ముఖ్యమంత్రితోపాటు ప్రధానికి అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన బాలల సంరక్షణ అధికారులు, లేబర్, పోలీస్, రెవెన్యూ, మహిళా, స్త్రీ శిశుసంక్షేమశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ ఒక్కసారిగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణకు చెందిన ఇంట్లో మగ్గుతున్న ముగ్గురు బాలకార్మికులకు చైల్డ్‌ప్రొటెక్షన్‌శాఖ అధికారులు విముక్తి కల్పించారు. జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 46లో ఉన్న మంత్రి నారాయణకు చెందిన ఇంట్లో బాలకార్మికులు ఉన్నట్లు కార్మికశాఖకు, బాలల సంరక్షణాధికారులకు, జిల్లా కమిషనర్, ముఖ్యమంత్రితోపాటు ప్రధానికి అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

దీంతో స్పందించిన బాలల సంరక్షణ అధికారులు, లేబర్, పోలీస్, రెవెన్యూ, మహిళా, స్త్రీ శిశుసంక్షేమశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ ఒక్కసారిగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. అయితే వారిని లోపలికి రాకుండా ఇంటికి సంబంధించిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లోపలికి వెళ్లి ముగ్గురు బాల కార్మికులను బయటకు తీసుకువచ్చారు. అయితే వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ, వివరాలు కానీ లభించలేదు. దీంతో ఆ ముగ్గురిని పునరావాస కేంద్రానికి తరలించారు. 

బల్విందర్‌సింగ్ ఇంట్లో బాలకార్మికులు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని దాంతో తాము దాడులు నిర్వహించినట్లు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్ స్పష్టం చేశారు. పిల్లలను ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకువచ్చారని, అయితే అది రిజష్టర్ అయిందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉన్నదన్నారు. 

click me!