అలా చెప్పడానికి సిగ్గులేదా: కోటంరెడ్డిపై మంత్రి నారాయణ ఫైర్

Published : Apr 19, 2019, 03:41 PM IST
అలా చెప్పడానికి సిగ్గులేదా: కోటంరెడ్డిపై మంత్రి నారాయణ ఫైర్

సారాంశం

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దాడి చేసిందే తన అనుచరులేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒప్పుకోవడం సిగ్గు చేటంటూ విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలో తిరుమల నాయుడు అనే టీడీపీ కార్యకర్త తీవ్ర గాయాలపాలయ్యారు. 

నెల్లూరు: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయి ఉండి రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

దాడి చేసిందే తన అనుచరులేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒప్పుకోవడం సిగ్గు చేటంటూ విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలో తిరుమల నాయుడు అనే టీడీపీ కార్యకర్త తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి నారాయణ తిరుమల నాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపించారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. పారిశ్రామిక ప్రగతి ఆగిపోతుందన్నారు. ఇకనైనా అంతా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలని మంత్రి నారాయణ హితవు పలికారు.   

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet