యువతలో పెరుగుతున్న అలసత్వం, డ్రగ్స్ వినియోగంపై పోరాడుదాం : నందమూరి బాలకృష్ణ

By Mahesh Rajamoni  |  First Published Aug 15, 2023, 3:42 PM IST

Independence Day 2023: 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ  ఛైర్మ‌న్ నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగుర వేసారు. అనంతరం జాతీయ గీతాలాపనతో జెండా వందనం చేశారు.  
 


Nandamuri Balakrishna: దేశంలో నెలకొన్న జాడ్యాలైన అవినీతి, యువతలో పెరుగుతున్న అలసత్వం, మాదక ద్రవ్యాల వినియోగంపై పోరాడాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ ఛైర్మ‌న్ నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగుర వేసారు. అనంతరం జాతీయ గీతాలాపనతో జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి నుద్దేశించి బాల‌కృష్ణ‌ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న పలు జాడ్యాలైన అవినీతి, యువతను పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అలసత్వం లాంటి వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు.  భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఎందరో మహానుభావులు, విప్లవకార్లు స్వాతంత్య్ర‌ పోరాటంలో పాల్గొన్నారనీ, చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో తిండి గింజలకు ఇబ్బంది పడే రోజు నుండి నేడు చంద్రునిపై స్వయంగా కాలుమోపే స్థాయికి భారత దేశం ఎదిగిందని పేర్కొన్నారు.

Latest Videos

దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని వారిలో ఒకరైన తన తండ్రిగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ సంస్థ గత 23 సంవత్సరములుగా ఎందరో పేద క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ పంథాలో కొనసాగడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా తెలుగువారితో పాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్యాన్సర్ పై పోరాడుతున్న చిన్నారులు, వైద్యులతో కలసి మూడు రంగులలో ఉన్న బెలూన్లను గాలిలో ఎగుర వేశారు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులకు, పేషెంట్లకు మిఠాయిలు పంచి పెట్టారు.

కాగా, ఈ సంస్థ‌లో నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు నందమూరి బాలకృష్ణ (ఛైర్మన్, BIACH&RI), డా. ఆర్ వి ప్రభాకర రావు (CEO, BIACH&RI), డా. టియస్ రావు (మెడికల్ డైరెక్టర్, BIACH&RI),  డా. కల్పనా రఘునాథ్ (ఆసోసియేట్ డైరెక్టర్, యాడ్ లైఫ్-అకడమిక్స్, BIACH&RI), డా. ఫణికోటేశ్వర రావు (మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI) లతో పాటూ పలువురు మెడికల్ విభాగాధిపతులు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాలుపంచుకున్నారు.

click me!