తిరుమలలో చిరుతల కలకలం:రెండు రోజుల్లో రెండు పులుల సంచారం

By narsimha lode  |  First Published Jul 9, 2021, 11:47 AM IST


తిరుమల ఆలయ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం భక్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. రెండు రోజుల వ్యవధుల్లో చిరుత పులులు కన్పించడంపై  భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. నిన్న ఘాట్ రోడ్డులో, ఇవాళ తిరుమల సన్నిధానం గెస్ట్ ‌హౌస్ వద్ద చిరుత కన్పించడంతో భక్తులు పరుగులు పెట్టారు. 



తిరుమల: తిరుమలలో చిరుతపులులు హల్ చల్ చేస్తున్నాయి. చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.  రెండు రోజులుగా తిరుమలలో చిరుతపులుల సంచారంతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీ అధికారులు కూడ అప్రమత్తమయ్యారు.

గురువారం నాడు  తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో  ఓక వైపు నుండి మరో వైపు రోడ్డు మార్గంలో వెళ్తున్న చిరుత భక్తులకు కన్పించింది.  తిరుమలలో వెంకన్న దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమౌతున్న భక్తులు చిరుతపులిని తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డును చిరుత పులి దాటే సమయంలో  పులికి కొద్దిదూరంలోనే భక్తులు తమ వాహనాన్ని నిలిపివేశారు. చిరుత అడవిలోకి వెళ్లిన తర్వాత తమ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.

Latest Videos

undefined

శుక్రవారం నాడు తిరుమల సన్నిధానం గెస్ట్ హౌస్ సెల్లార్  వద్ద చిరుతపులి  సంచారం కలకలం రేపుతోంది. సెల్లార్ నుండి  అడవి పందులను వేటాడుతూ ఓ అడవి పందిని చిరుతపులి తన నోట కర్చుకొని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

తిరుమలకు 47 కి.మీ పరిధిలో సుమారు 120 చిరుత పులులు ఉన్నాయని అటవీశాఖాధికారులు గుర్తించారు. తిరుమల చుట్టు పక్కల్లోని 27 ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డులోని 12 చోట్ల,  నడక మార్గంలోని 5 ప్రాంతాల్లో, తిరుమలలో 8 చోట్ల చిరుతపులులు సంచరిస్తున్నాయని  అటవీశాఖాధికారులు గుర్తించారు.

2020 మార్చి నుండి కరోనా కారణంగా భక్తుల సంఖ్య పరిమితంగా ఉంది. దీంతో వన్యప్రాణుల సంచారం పెరిగిందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.  మార్చి నుండి 80 రోజుల పాటు తిరుమల ఆలయంలో భక్తులకు ప్రవేశం లేదు. ఆ తర్వాత కూడ పరిమితంగానే భక్తులను అనుమతిస్తున్నారు.


 

click me!