అవిశ్వాసం ఎఫెక్ట్: జేసీ ఇంటి ముందు వామపక్షాల ధర్నా

First Published Jul 19, 2018, 4:38 PM IST
Highlights

కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్‌కు హాజరుకాకూడదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇంటి ముందు వామపక్షాలు గురువారం నాడు ధర్నా నిర్వహించాయి.
 

అనంతపురం: కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్‌కు హాజరుకాకూడదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇంటి ముందు వామపక్షాలు గురువారం నాడు ధర్నా నిర్వహించాయి.

తన డిమాండ్లను ఈ నెల 25వ తేదీ వరకు పరిష్కరించాలని జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు.  ఈ విషయమై ఆ పార్టీ  అధిష్టానం కేంద్రీకరించింది.  

తాను పార్లమెంట్‌కు హాజరుకాకున్నా పెద్దగా నష్టం ఉండదని కూడ జేసీ ప్రకటించారు. జేసీ ప్రకటనను నిరసిస్తూ  వామపక్షాల పార్టీ కార్యకర్తలు గురువారం నాడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. కీలకమైన సమయంలో  ఏపీకి అన్యాయం చేసిన కేంద్రానికి మద్దతుగా నిలవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

వామపక్షాల ఆందోళనతో అనంతపురంలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో  ఆందోళన చేస్తున్న వామపక్షపార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. విప్ ధిక్కరిస్తే ఆయనపై పార్టీ చర్యలు తీసుకొంటుందని చెప్పారు.
 

click me!