విశాఖ బీచ్ రోడ్‌లో 18 ఆస్తుల అమ్మకం : వామపక్షాల నిరసన

By AN TeluguFirst Published Apr 10, 2021, 2:11 PM IST
Highlights

విశాఖ నగరంలోని బీచ్‌ రోడ్‌లో 13.59 ఎకరాలతో పాటు మొత్తం 18 ఆస్తులు విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని సిపిఐ(ఎం), సీపీఐ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే ఈ చర్యను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది.

విశాఖ నగరంలోని బీచ్‌ రోడ్‌లో 13.59 ఎకరాలతో పాటు మొత్తం 18 ఆస్తులు విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని సిపిఐ(ఎం), సీపీఐ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే ఈ చర్యను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది.
        
శనివారం బీచ్ రోడ్ లో ఉన్న ఎపిఐఐసి భూముల వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి డా.బి.గంగారావు మాట్లాడుతూ మిషన్‌ బెల్డ్‌ ఏపి పేర నగరంలో వున్న ప్రభుత్వ భూములను పెద్దఎత్తున అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడం సిగ్గుచేటు అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విశాఖబీచ్ రోడ్లో చంద్రబాబు లూలూ సంస్థకు భూమిని అప్పనంగా కట్టబెట్టాలని చూసింది. 9.12 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్దపడితే లూలూ సంస్థ సరిపోదని తెలిపింది. ప్రక్కనే వున్న సి.యం.ఆర్ స్థలం 3.4 ఎకరాలు కూడా తీసుకొని లూలూకు కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. 

సి.యం.ఆర్ కి ఉడా నగర నడిబోడ్డులో వున్నా ఖరీదైన స్థలాలను రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించి మరీ కట్టబెట్టింది  దీనిపై వామపక్షాలతో పాటు నాడు ప్రతిపక్షంలో వున్న జగన్ పార్టీ కూడా వ్యతికించింది. విశాఖ వైకాపా నాయకులు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.

మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అదే అత్యంత ఖరీదైన స్థలాలు అమ్మటానికి సిద్దపడితే  ఎందుకు నోరుమేదపటం లేదని అడుగుతున్నాం. జీవీఎంసి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు భూముల అమ్మకానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని భావిస్తున్నామన్నారు.

మొదటి దశలో మొత్తం 18 ఎకరాలకు పైగా అమ్మకానికి పెట్టారు. రెండోదశలో ప్రభుత్వ కంటి ఆసుపత్రి స్థలం, విశాలాక్షి నగర్‌ పోలీస్‌ క్వార్టర్స్‌, ఆంధ్రా యూనివర్సిటీ, జీవీఎంసి స్థలాలతోపాటు అనేకచోట్ల రెవెన్యూ స్థలాలను కూడా అమ్మేయాలని నిర్ణయించారు. 

ఈ భూములు  తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మకాన్ని ఆపి ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
      
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి యం.పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే.యస్వీ.కుమార్, నాయకులు వై.రాజు, సుబ్బారావు, రెహ్మాన్, మన్మధరావు,చంద్రశేఖర్,కాసులరెడ్డి, యల్.జె.నాయుడు, కుమారి అప్పారావు, నరేంద్ర కుమార్ చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

click me!