నిట్ లో కీచక లెక్చరర్.. వైవాకు పిలిచి ఒంటిపై చెయ్యేసి.. అసభ్యంగా మాట్లాడుతూ...

By SumaBala Bukka  |  First Published Oct 29, 2022, 7:20 AM IST

ఏపీ తాడేపల్లి గూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిట్ లో విద్యార్థినులను వైవా పేరుతో పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఓ లెక్చరర్. విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో అతడిని సస్పెండ్ చేశారు. 


ఏలూరు :  తాడేపల్లిగూడెం లోని ఏపీ నిట్ లో ఓ కీచక ఆచార్యుడు విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. బయోటెక్నాలజీ కాంట్రాక్ట్ లెక్చరర్ తమిళ్ మణి వైవా పేరుతో అమ్మాయిలను ఒంటరిగా పిలిచి ఒంటిపై చేతులు వేయడం, అసభ్యంగా మాట్లాడుతుండడంతో విద్యార్థులు కళాశాల పరిపాలనా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వారికి సర్దిచెప్పి యాజమాన్యం శతవిధాలా ప్రయత్నించింది.

ఆందోళన ఆపకపోతే హాజరు, ఇంటర్నల్ మార్కులు  భారీగా కోత విధిస్తామని భయపెట్టారని విద్యార్థులు ఆరోపించారు. ‘నాలుగో ఏడాది విద్యార్థులు ఈ ఏడాదితో బయటికి వెళ్లిపోతారు. మీ సంగతి ఆలోచించుకోండి’ అంటూ బెదిరించారు. అయినా వారు తగ్గలేదు. దీంతో యాజమాన్యం పోలీసులకు పిలిచి భయపెట్టడానికి ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపించారు.

Latest Videos

వివాహేతర సంబంధం : భర్త అవమాన పడుతున్నాడని.. ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య..

విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో తమిళ్ మణిని విధుల నుంచి తొలగించినట్లు ఇన్చార్జి డాక్టర్ పి. దినేష్ రెడ్డి ప్రకటించారు. పట్టణ సిఐ నాగరాజు విద్యార్థులతో  మాట్లాడి  కీచక ఆచార్యుడిపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో తెలంగాణలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన  ప్రధానోపాధ్యాయుడు.. ‘పట్టుకోండి చూద్దాం’ అనే  ఆట పేరుతో బాలికల కళ్ళకు గంతలు కట్టి, పిల్లలతో కలిపి తాను ఆడుతున్నట్లు గా నటిస్తూనే కళ్ళకు గంతలు కట్టి ఉన్న అమ్మాయిలను ఏమార్చి.. స్టోర్ రూంలోకి తీసుకు వెళ్లి, అక్కడ వారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. 

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇప్పటివరకు  నలుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. బాధితులంతా మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలే. బడికి వెళ్లేందుకు ఆ చిన్నారులు భయపడుతుండటంతో వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. నిందితుడు, అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న అనిల్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.  

చింతలపాలెం ఎస్సై రంజిత్ రెడ్డి, బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 28 ఏళ్ల అనిల్ కు గత ఏడాది పెళ్లయింది. మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో 90 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి. ఒక స్టోర్ రూమ్ ఉంది.  

అక్కడ అనిల్ తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత ఉండటంతో 90 మంది పిల్లలను ఒకేచోట ఉంచి పాఠాలు చెబుతున్నారు. మధ్యాహ్నం మూడు-నాలుగు గంటల మధ్య విద్యార్థులతో ఆటలు ఆడించి ఇంటికి పంపుతున్నారు. గత పది రోజులుగా బాలికలపై అనిల్ లైంగిక దాడికి పాల్పడుతునట్లు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!