అబ్ధుల్ సలాం కేసు: టీడీపీ లాయర్ సంచలన నిర్ణయం

Siva Kodati |  
Published : Nov 11, 2020, 08:35 PM ISTUpdated : Nov 11, 2020, 08:36 PM IST
అబ్ధుల్ సలాం కేసు: టీడీపీ లాయర్ సంచలన నిర్ణయం

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నంద్యాల సలాం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుల్ తరపున వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నంద్యాల సలాం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుల్ తరపున వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి సైతం ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 

అంతకుముందు నంద్యాల ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులను అరెస్టు చేశామన్న ఆయన టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు అనే లాయర్ , బెయిల్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు.

బెయిల్ ను రద్దు చేసేందుకు పై కోర్టుకు వెళ్లామన్న ఆయన బెయిల్ తప్పకుండా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు నంద్యాల కోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ 3వ అదనపు జిల్లా సెషన్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు పోలీస్ అధికారులు.

Also Read:నంద్యాలలో సలాం కుటుంబం సూసైడ్: జగన్ స్పందన ఇదీ
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu