వచ్చే ఎన్నికల్లో తన పోటీపై స్పందించిన లక్ష్మీపార్వతి

Published : Oct 19, 2018, 12:53 PM IST
వచ్చే ఎన్నికల్లో తన పోటీపై స్పందించిన లక్ష్మీపార్వతి

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా తాను ప్రచారం చేస్తానని లక్ష్మీపార్వతి చెప్పారు .2019 ఎన్నికల్లో ఆమె కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది.

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. ఆమె శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగితే పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని సమాధానమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా తాను ప్రచారం చేస్తానని లక్ష్మీపార్వతి చెప్పారు .

2019 ఎన్నికల్లో ఆమె కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. ఆమె ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెసులో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు