టీడీపీ నుంచి పోటీ... క్లారిటీ ఇచ్చిన లగడపాటి

By ramya NFirst Published 22, Feb 2019, 10:20 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ తరపున పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ తరపున పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయం పై తాజాగా లగడపాటి క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ జడ్పీటీసీ, టీడీపీ మహిళా నేత భారతిని పరామర్శించేందుకు లగడపాటి ఇటీవల మునగపాడు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు స్థానిక నేతలంతా అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో మీరు ఏలూరు నుంచి పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని లగడపాటిని కొందరు ఆసక్తిగా అడిగారు. అలాంటిది ఏమి లేదని నవ్వుతూ సమాధానం చెప్పారు.

Last Updated 22, Feb 2019, 10:20 AM IST