చంద్రబాబుకు హైదరాబాదులో రేపు నోటీసులు ఇస్తాం: కర్నూలు ఎస్పీ ఫకీరప్ప

By telugu teamFirst Published May 8, 2021, 3:44 PM IST
Highlights

కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై నోటీసులు ఇస్తామని జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. సుబ్బయ్య అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కర్నూలు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేస్తామని కర్నూలు జిల్ాల ఎస్పీ ఫకీరప్ప చెప్పారు చంద్రబాబు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన శనివారం మీడియాతో చెప్పారు కర్నూలులో ఎన్440కె వైరస ఉందని చంద్రబాబు దుష్ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతాలకు గురిచేసాఱని తమకు ఫిర్యాదు వచ్చిందని ఆయన చెప్పారు. 

చంద్రబాబుకు రేపు ఆదివారం హైదరాబాదులో నోటీసులు అందిస్తామని ఫకీరప్ప చెప్పారు. ఏడు రోజుల లోపల చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందని చంద్రబాబు జూమ్ సమావేశంలో చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యల వల్లనే ఏపీ నుంచి వచ్చేవారిపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఫకీరప్ప తెలిపారు కొత్త స్ట్రెయిన్ వైరస్ లేదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని ఆయన అన్నారు. శుక్రవారంనాడు చంద్రబాబు ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం తెలిసిందే. 

కర్నూలు ఎన్440కే వైరస్ ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చంద్రబాబుపై ఐపిసి 155, 505 (1), బి (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు ప్రకటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొడాలి నాని వంటి మంత్రులు చంద్రబాబు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రకటన తర్వాత అటువంటి వేరియంట్ ఏదీ లేదని కొన్ని సంస్థలు ప్రకటించాయి కూడా.

click me!