తెలుగు రాష్ట్రాల్లో ఆగని ఆర్టీసి ప్రమాదాలు... మరో బస్సు ప్రమాదంలో నలుగురు మృతి

By Arun Kumar PFirst Published 12, Sep 2018, 5:05 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసి ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళ వారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆర్టీసి బస్సు బోల్తా పడటంతో దాదాపు 60 మంది మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదపు రక్తపు మరకలు ఆరకముందే మరో తెలుగు రాష్ట్రంలో ఆర్టీసి బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
 
చిత్తూరు జిల్లా టేకలకోన వద్ద ఆర్టీసి బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఒకదానికొకటి ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్నికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

Last Updated 19, Sep 2018, 9:24 AM IST