ఇద్దరు వైసీపీ నాయకుల దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రత్యర్థులు..

Published : Jan 27, 2022, 01:02 PM IST
ఇద్దరు వైసీపీ నాయకుల దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రత్యర్థులు..

సారాంశం

కర్నూలు జిల్లా కౌటల మండలం కామవరంలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలు, భూతగాదా.. ఇద్దరి హత్యకు దారితీసింది.  వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై వేట కొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు.. పెట్రోల్ పోసి నిప్పటించారు. 

కర్నూలు జిల్లా కౌటల మండలం కామవరంలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలు, భూతగాదా.. ఇద్దరి హత్యకు దారితీసింది.  వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై వేట కొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు.. పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో శివప్ప, ఈరన్నలు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిపై బీజేపీకి చెందిన మల్లికార్జున, అతని వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వివరాలు.. కామవరం గ్రామంలోని శివప్ప, ఈరన్న వర్గానికి.. అదే గ్రామానికి చెందిన మల్లికార్జున వర్గానికి మధ్య భూవివాదం ఉంది. ఇందులో మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతుంటే.. శివప్ప వర్గం వైసీపీలో ఉంది. అయితే ఈ రోజు ఉదయం భూతగాదా విషయం మాట్లాడటానికి వెళ్లిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మల్లికార్జున వర్గీయులు శివప్, ఈరన్నలపై దాడికి పాల్పడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?