గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌర సేవలను మరింత వేగంగా అమలు చేయడం కోసం జగన్ సర్కార్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీ సేవా పోర్టల్ ను గురువారం నాడు ప్రారంభించింది.
అమరావతి: సిటిజన్ సర్వీస్ పోర్టల్ 2.0 ను ఏపీ సీఎం YS Jagan గురువారం నాడు ప్రారంభించారు. ఈ పోర్టల్ కు AP Seva Portal గా పేరును పెట్టామని సీఎం జగన్ చెప్పారు. వేర్వేరు శాఖలన్నీ ఒకే పోర్టల్ కిందకు తీసుకొచ్చామని సీఎం చెప్పారు.
ఈ పోర్టల్ ద్వారా లబ్దిదారుడు తమ అప్లికేషన్ ఏ స్టేటస్ లో ఉందో కూడా తెలుసుకోవచ్చని చెప్పారు సీఎం. మారుమూల గ్రామాలకు కూడా వేగంగా సేవలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కూడా ఏపీ సేవా పోర్టల్ దోహదపడుతుందన్నారు.
గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో అమలు చేసి చూపించామన్నారు సీఎం జగన్. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ప్రజలకు ఉండదని సీఎం చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత వేగంగా ప్రజలకు సేవలు అందిస్తామని సీఎం తెలిపారు. ఎస్‌ఎంఎస్ ల ద్వారా లబ్దిదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కూడా ఉంటుందని సీఎం వివరించారు.
గ్రామ, ward సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు.2.60 లక్షల మంది వలంటీర్లు ఇంటింటికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారని సీఎం జగన్ చెప్పారు. మున్సిపాలిటీల్లో 100 ఇళ్లకు ఓ వలంటీరు పనిచేస్తున్నారన్నారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా మరింత వేగంగా సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ఏ అధికారి వద్ద ఫైల్ ఉందో కూడా లబ్దిదారుడికి ఈ పోర్టల్ ద్వారా తెలుస్తుందని జగన్ చెప్పారు.
ఏపీ సేవా పోర్టల్‌ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చామని సీఎం చెప్పారు.మున్సిపాల్టీలకు సంబంధించిన 25 సేవలు, పౌరసరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్‌రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలనుకూడా పోర్టల్ కిందకు తీసుకు వచ్చామని సీఎం వివరించారు.
తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని సీఎం చెప్పారు ఒకచోట దరఖాస్తు చేస్తే వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలను కూడా వివరిస్తామన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కు పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన పరిస్థితిలోకి అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3.46 కోట్ల మందికి లబ్ది జరగనుందన్నారు.
రెండేళ్లకాలంలో ఇంతమందికి సేవలు అందించారంటే ఏస్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో మనకు తెలుస్తోందని సీఎం చెప్పారు. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ కొత్తగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఇది మరింత బాధ్యతను, పారదర్శకతను పెంచుతుందిదని సీఎం అభిప్రాయపడ్డారు. పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఇవాల్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ సేవపోర్టల్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు.