Kuppam Election: మమ్మల్ని అడ్డుకోవడం కోర్టు ధిక్కారమే: పోలీసులకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 10:49 AM IST
Highlights

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తూ టిడిపి నాయకులను కుప్పంలో ప్రచారం చేయకుండాా అడ్డుకుంటున్నారని అన్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసుల తీరుపై నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''చిత్తూరు జిల్లా kuppammunicipal election నేపథ్యలో ప్రచారం నిర్వహించకుండా మమ్మల్ని ఇప్పటికే 48 గంటల పాటు పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఇది అక్రమమని, ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం చట్టవ్యతిరేకమని, సెక్షన్ 14,19 కి విరుద్దమని కోర్టు తేల్చింది. దీనిపై ఎస్పీ, డీఎస్పీ  సమాధానం చెప్పాలని కూడా కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే పోలీసులు కోర్టు  ఉత్తర్వులను సైతం దిక్కరిస్తూ ఇప్పటికీ మమ్మల్ని బయటకు వెళ్లనీయటం లేదు'' అని nimmala ramanaidu ఆందోళన వ్యక్తం చేసారు. 

''మమ్మల్సి అడ్డుకోవడం కోర్టు ఆదేశాలను దిక్కరించడమే. కోర్టు ఇచ్చిన ఆర్దర్ చూపినా పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.  కోర్టు ఆర్టర్ సీఐకి చూపిస్తే డీఎస్పీకి చెప్పాలన్నారు. డీఎస్సీకి చూపిస్తే ఎస్పీకి చెప్పాలంటున్నారు. ఎస్పీకి వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపి ఫోన్ చేసినా స్పందించలేదు. మమ్మల్ని వదలిపెట్టమని ఎస్పీకి cm jagan చెప్పాలేమో? లేకపోతే పోలీసులు ఎందుకు వదలిపెట్టడం లేదు?'' అని నిలదీసారు. 

read more  Kuppam Election:చంద్రబాబు ఇలాకాలో ఉద్రిక్తత... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టిడిపి చీఫ్ అరెస్ట్

''పోలీసులు జగన్ రెడ్డి చెప్పినట్టు కాకుండా కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇప్పటికైనా పోలీసులు కోర్టు ఉత్తర్వులు గౌరవించి గృహనిర్భందం నుంచి మమ్మల్ని విడుదల చేయాలి. జగన్ రెడ్డి ఓటమి భయంతో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతున్నారు. పోలీసులు లేకుండా పోటీ చేస్తే వైసీపీకి ఒక్క కౌన్సిల్ సీటు కూడా రాదు'' అని నిమ్మల రామానాయడు అన్నారు.

వీడియో

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి నేతల ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ధర్నాకు దిగిన టిడిపి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టిడిపి అధ్యక్షుడు పులివర్తి నానిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే ఎమ్మెల్యే రామానాయుడుకు నోటీసులు అందించి గృహనిర్బందం చేసారు. 

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి తరపున 126, వైసిపి నుండి 89, కాంగ్రెస్ 15, బిజెపి నుండి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినా అధికారులు తుది జాబితాను విడుదల చేయడం ఆలస్యమయ్యింది. రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, టిడిపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగి అమర్నాథ్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. 

read more  ఫేక్ సంతకాలతో ఏకగ్రీవాలు.. అభ్యర్థులు కోర్టుకెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకే: చంద్రబాబు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. ఎన్నిక ఏదయినా ఇక్కడ టిడిపిదే విజయం. అయితే టిడిపికి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి పరాభవాన్ని చవిచూసింది. మరోసారి ఇక్కడ టిడిపిని ఓడించి చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టాలని అధికార వైసిపి భావిస్తోంది. దీంతో ఈ ఒక్క మున్సిపాలిటీని గెలుచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.

అయితే గత పరాభవానికి గట్టిగా బదులివ్వాలని టిడిపి భావిస్తోంది. ఈసారి ఎలాగయినా తిరిగి విజయం సాధించి సత్తా చాటాలని టిడిపి చూస్తోంది. ఇలా ఇరుపార్టీలు కుప్పం మున్సిపల్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 
 

click me!