
అమరావతి : న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులను పదేపదే అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ .. social mediaల్లో వీడియోలు పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేసేందుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇంటర్పోల్ ద్వారా అతని యూట్యూబ్ ఛానల్ ను బ్లాక్ చేసింది.
punch prabhakarతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు విదేశాల్లోనే ఉంటున్నందున వారందరిని అరెస్టు చేసేందుకు సంబంధిత న్యాయస్థానాల నుంచి వారెంట్ తీసుకుంది. అందుకు దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 53 మొబైల్ నెంబర్ లోకల్ డీటెయిల్స్ రికార్డును (సిడిఆర్) సేకరించినట్లు సిబిఐ తెలిపింది.
కేసు నమోదు చేశాక చాలామంది తాము పెట్టిన అనుచిత పోస్టులు తొలగించినందున Digital forensic technology ద్వారా ఆధారాల సేకరణపై దృష్టి సారించింది. మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ సహకారంతో నిందితుల ఫేస్బుక్ ప్రొఫైల్స్, పోస్టులు, Twitter accounts, ట్వీట్లు, YouTube videos తదితరాల నుంచి సమాచారం సేకరిస్తోంది. నిందితుల నుంచి 13 డిజిటల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితుల్ని మరో 14 మంది ఇతరుల్ని విచారించింది.
మొత్తంగా 11 చార్జిషీట్లు దాఖలు
ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిపై సిబిఐ గురువారం గుంటూరులోని సివిల్ జడ్జి న్యాయస్థానం.. (CBI Designated Court)లో వేర్వేరుగా అభియోగ పత్రాలు దాఖలు చేసింది. Indecent abuse వ్యవహారంలో అవుతు శ్రీధర్ రెడ్డి (ఏ7), జలగం వెంకట సత్యనారాయణ (ఏ8), గూడ శ్రీధర్ రెడ్డి (ఏ9), శ్రీనాథ్ సుస్వరం (ఏ12), దరిశ కిషోర్ రెడ్డి (ఏ13)తో పాటు ముదునూరి అజయ్ అమృతల ప్రమేయాన్ని చార్జిషీట్లో ప్రస్తావించింది.
వీరంతా అక్టోబర్ 22న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే ధనిరెడ్డి కొండా రెడ్డి (ఏ1), పాములు సుదీర్ (ఏ3), ఆదర్శ పట్టపు అలియాస్ ఆదర్శ రెడ్డి (ఏ4), లావనూరు సాంబశివారెడ్డి అలియాస్ శివారెడ్డి (ఏ6), లింగా రెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఏ15) లను అరెస్టు చేసి.. వారి పాత్రపై వేరువేరుగా Chargesheets దాఖలు చేసింది.
ఇప్పటి వరకు మొత్తం 11 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ వారి ప్రాణాలకు హాని కలిగిస్తాయని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనేది వీరందరి పై ప్రధాన అభియోగం.
సిబిఐ రంగంలోకి దిగిన ఏడాదికి...
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా Supreme Court and High Court Judgesకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైకోర్టు అప్పటి రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుపై గతేడాది ఏప్రిల్ 16 నుంచి జూలై 17 మధ్య సిఐడి లోని సైబర్ నేరాల విభాగం 12 కేసులు పెట్టింది. 16 మందిని నిందితులుగా పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది నవంబర్ 11న సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. స్వభావరీత్యా 12 కేసులూ ఒకే తరహాలో ఉన్నందున.. వాటన్నిటిపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి 16 మందిని నిందితులుగా గుర్తించింది. 17వ నిందితుడి స్థానంలో వివరాలు తెలియని వ్యక్తి గా పేర్కొంది.