చంద్రబాబు కుట్రతోనే పథకాలు ఆగాయా!?

By Rajesh KarampooriFirst Published May 10, 2024, 3:42 PM IST
Highlights

ఏపీలో ఎన్నికల వేళ అధికార పార్టీ అమలు చేస్తున్న డీబీటీ పథకాల పైన సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టు అనుమతించినా..ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఈ విషయం రాజకీయంగా చర్చనీయంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నాయి. ప్రధానం కూటమి, సీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడుతున్న నేపథ్యంలో నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష కూటమికి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. 

పోలింగ్ వేళ డీబీటీ పథకాల అమలు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టు అనుమతించినా..ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఈ పరిణామానికి ప్రతిపక్ష టీడీపీనే కారణమని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. డీబీటీ లబ్ధిదారులతో ప్రతి టీడీపీ ముఠా చెలగాటమాడుతోందనీ, లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోందనీ,ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని, నిన్న అర్థరాత్రి  హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయని వైసీపీ నేతలు  వెల్లడిస్తున్నారు.

హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారనీ, క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరినా.. ఇప్పటివరకూ ఎన్నికల కమిషన్ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదని, ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే..  తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. మరోవైపు.. ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని, అందుకే నవతరం పార్టీ తరఫున పరోక్షంగా టీడీపీ తరుపున కోర్టులో అప్పీల్ వేసిందని ఆరోపిస్తుంది.  తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఎన్నికల కమిషన్ వెల్లడించినా, ఈ పరిణామం రావడానికి అసలు సూత్రధారి  టీడీపీనేననీ, త్వరలోనే టీడీపీ బాగోతం బయటపడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నాయకులు. 
 

click me!