ఆసక్తికరం: బాబుకు కేటీఆర్ శుభాకాంక్షలు, ఏపీలో పోటీపై ఏమన్నాడంటే?...

First Published Jul 15, 2018, 4:26 PM IST
Highlights

: ట్విట్టర్ వేదికగా  నెటిజన్లు సంధించిన పలు ప్రశ్నలకు తెలంగాణ  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.  వైఎస్ఆర్, కేసీఆర్ లలో ఎవరు గొప్ప ముఖ్యమంత్రి అంటే  సమాధానం మీకే తెలుసంటూ తెలివిగా జవాబిచ్చారు

హైదరాబాద్: ట్విట్టర్ వేదికగా  నెటిజన్లు సంధించిన పలు ప్రశ్నలకు తెలంగాణ  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.  వైఎస్ఆర్, కేసీఆర్ లలో ఎవరు గొప్ప ముఖ్యమంత్రి అంటే  సమాధానం మీకే తెలుసంటూ తెలివిగా జవాబిచ్చారు. రాజకీయాల నుండి రిటైరయ్యాక తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాల గురించి  చెబుతానని ప్రకటించారు.

ప్రశ్నించండి అనే హ్యాష్ ట్యాగ్ ‌తో కేటీఆర్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రశ్నలు వచ్చాయి.  ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.  నెటిజన్లు వేసిన ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ఏపీ నుండి పోటీ చేయాలని తన లాంటి వారు కోరుకొంటున్నారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ అదే రీతిలో జవాబు చెప్పాడు. భవిష్యత్తులో ఏం జరుగుతోందో చెప్పలేమన్నారు. అమ్మాయిల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు తనకు అంత ధైర్యం లేదన్నాడు. 

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కూడ కేసీఆర్ సీఎంగా ఎన్నిక అవుతారని కేటీఆర్ ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనకు నచ్చిన రాజకీయ నేత అంటూప ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చాడు. జమిలి ఎన్నికలను తాను స్వాగతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కూడ తాను సిరిసిల్ల నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. హైద్రాబాద్ నగరంలోని ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్  సిరిసిల్ల నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. మూడు దఫాలు తనపై సిరిసిల్ల ప్రజలు నమ్మకముంచి గెలిపించారని ఆయన గుర్తు చేశారు.

శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఉంటారనేందుకు పరిపూర్ణానందస్వామి, కత్తి మహేష్ నగర బహిష్కరణ అంశం  నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. వీరిద్దరి నగర బహిష్కరణలపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు కేటీఆర్ పై విధంగా స్పందించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమస్థానంలో నిలిచినందుకు  ఆ రాష్ట్రానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 0.09 శాతంతో తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వెనుకబడిందని ఆయన చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఓ నెటిజన్ కేటీఆర్ కు సరదాగా  కామెంట్ పెట్టాడు. అయితే అంతే సరదాగా కేటీఆర్ సమాధానమిచ్చాడు. ఇదంతా సులువైన విషయం కాదన్నారు.  

వైఎస్ఆర్, కేసీఆర్ లలో ఎవరు గొప్ప ముఖ్యమంత్రి అంటే  సమాధానం మీకే తెలుసంటూ తెలివిగా జవాబిచ్చారు. అయితే ఈ సమాధానంపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. పరోక్షంగా కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ పరోక్షంగా చెప్పారని కామెంట్స్ చేశారు.


 

click me!